Page Loader
Chhaava: అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్న 'ఛావా'.. విడుదలకు ముందే రూ.9.23 కోట్లు కలెక్షన్
అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్న 'ఛావా'.. విడుదలకు ముందే రూ.9.23 కోట్లు కలెక్షన్

Chhaava: అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్న 'ఛావా'.. విడుదలకు ముందే రూ.9.23 కోట్లు కలెక్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14, శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. సాధారణంగా వాలెంటైన్స్ డే రోజున ప్రేమ, శృంగారభరిత సినిమాలు ఎక్కువగా రిలీజ్ చేయాలని చూసే బాలీవుడ్, ఈసారి మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చారిత్రక చిత్రం 'ఛావా'ను ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో బాలీవుడ్‌కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇవ్వనుందని అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి.

Details

చావాకు భారీ రెస్పాన్స్

బాలీవుడ్ టికెట్ ట్రాకింగ్ సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం 'ఛావా'కి అడ్వాన్స్ బుకింగ్ నంబర్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'బాడ్ యాస్ రవి కుమార్', 'లవ్యాప', 'దేవా', 'స్కై ఫోర్స్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మాత్రం భారీ రెస్పాన్స్ పొందుతోంది. రిలీజ్‌కు ముందే 9.23 కోట్ల వసూళ్లు! గురువారం ఉదయం వరకు 'ఛావా' అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ. 9.23 కోట్లు రాబట్టింది. సినిమా విడుదల రోజున కనీసం రూ. 11-12 కోట్లు అంచనా వేశారు. ఈ చిత్రం 'సనమ్ తేరీ కసమ్' సినిమాతో పోటీ పడుతోంది.

Details

హిట్ సాధించే అవకాశం

'ఛావా' సినిమాపై క్రేజ్ చూస్తే, ఇది బాలీవుడ్‌కు మరో భారీ హిట్ అందించే చాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.