LOADING...
Ranabaali: 'రణబాలి' గ్లింప్స్‌పై ఏఐ ప్రచారాలకు చెక్‌.. దర్శకుడు రాహుల్‌ క్లారిటీ

Ranabaali: 'రణబాలి' గ్లింప్స్‌పై ఏఐ ప్రచారాలకు చెక్‌.. దర్శకుడు రాహుల్‌ క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ దేవరకొండ హీరోగా, రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రణబాలి'. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే, ఈ వీడియోను ఏఐ సాయంతో రూపొందించారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్‌ కావడంతో దర్శకుడు స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. గ్లింప్స్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను సంప్రదాయ పద్ధతుల్లోనే ఎంతో శ్రమతో డిజైన్‌ చేసినట్లు దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ వెల్లడించారు. ఈ వీడియోను సిద్ధం చేయడానికి తమ టీమ్‌కు కొన్ని నెలల సమయం పట్టిందని తెలిపారు. దీంతో ఏఐ వినియోగించారన్న ప్రచారానికి పూర్తిగా చెక్‌ పడింది.

Details

బృందంపై నెటిజన్లు ప్రశంసలు

కృత్రిమ మేధ సహాయం లేకుండానే ఇంత హైక్వాలిటీ వీడియోను రూపొందించినందుకు చిత్ర బృందంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు కఠిన శ్రమే ఈ గ్లింప్స్‌ విజయంలో కీలకంగా నిలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. 'రణబాలి' విషయానికొస్తే 'టాక్సీవాలా' విజయం తర్వాత విజయ్‌ దేవరకొండ - రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇదే. ఈ సినిమా 1854నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటించనుండగా, సర్‌ థియోడోర్‌ హెక్టార్‌ అనే బ్రిటిష్‌ అధికారి పాత్రలో ఆర్నాల్డ్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'రణబాలి' సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement