
చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది.
మొదటగా ఈ సినిమా చిత్రీకరణకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. అవన్నీ తొలగిపోయి గతేడాది నుండి ఇండియన్ 2 సినిమా షూటింగ్ సాఫీగా సాగుతోంది.
అయితే తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ని నిర్వాహకులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టులోని లావెటరీ ఏరియాలో షూటింగ్ కి అనుమతులు లేవని అధికారులు అడ్డుకున్నారు.
అంతకుముందు డిపార్చర్ ప్రాంతంలో కొన్ని సీన్లు చిత్రీకరించింది ఇండియన్ 2 బృందం.
Details
కోటి 24 లక్షల రూపాయలతో పర్మిషన్
కేవలం డిపార్చర్ ప్రాంతంలో మాత్రమే షూటింగ్ జరుపుకోవడానికే పర్మిషన్ తీసుకున్నారని, ఎయిర్ పోర్ట్ లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకోలేదన్న కారణంతో ఇండియన్ 2 షూటింగును అడ్డుకున్నారు.
ఎయిర్ పోర్టులో చిత్రీకరించడానికి ఇండియన్ 2 యూనిట్, కోటి 24 లక్షల రూపాయలు చెల్లించి అనుమతి తీసుకున్నారని సమాచారం.
ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. లైకా ప్రొటెక్షన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తమిళంలో కమలహాసన్ తో, ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శంకర్, తెలుగులో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను కూడా రూపొందిస్తున్నాడు.