LOADING...
Chiranjeevi-Balakrishna : చిరు,బాలయ్య మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి 
చిరు,బాలయ్య మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Chiranjeevi-Balakrishna : చిరు,బాలయ్య మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా వస్తోంది. చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కొత్త మూవీకి 'మన శంకర వర ప్రసాద్ గారు'అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కూడా పాల్గొని,సినిమా పట్ల తన ఉత్సాహం, అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

వివరాలు 

చిరంజీవి-బాలకృష్ణ కాంబో ఎప్పుడు?

అనిల్ మాట్లాడుతూ, "నేను చిన్నప్పటి నుంచే చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటప్పుడు, ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం నాకు దొరకడం నా జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం. చిరంజీవి గారి మొదటి షాట్ మానిటర్‌లో చూసినప్పుడు నా హృదయం చాలా భావోద్వేగంతో నిండిపోయింది.ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ గారిని చూపించే అవకాశాలు కలిగింది అంటూ తెలిపారు . తర్వాత, రిపోర్టర్లు చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో అడిగారు.

వివరాలు 

వింటేజ్ చిరును మీరు చూస్తారు 

అనిల్ స్పందిస్తూ, "గతంలో చిరంజీవి గారు కూడా బాలకృష్ణతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ సరైన కథ దొరకాలి కదా. ఎందుకంటే ఇద్దరి స్టార్ డమ్, మ్యానరిజం, ఫ్యాన్ బేస్ వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరికీ తగ్గిన కథ దొరికినపుడు మాత్రమే సినిమా తీస్తాం.దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికి, చిరంజీవి-వెంకటేశ్ కాంబోలో సినిమా అవకాశం దక్కింది,"అని చెప్పారు. సాధ్యమైతే ప్రతి ఏడాది సంక్రాంతికి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు,క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే అనేక అంశాలు ఉన్నాయి. ఇందులో వింటేజ్ మెగాస్టార్‌ను చూపించబోతున్నాం.చిరంజీవి తన లుక్స్‌ను ఎంతో కష్టపడి మార్చుకున్నాడు,అందుకే మేము ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం,"అని స్పష్టం చేశారు.