
Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా చరిత్రలో నిలువెత్తు శిఖరం చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు. 68ఏళ్ళ వయసులో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఆస్తులు, ఆయన గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్ల వివరాలు తెలుసుకుందాం.
చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ రూ.1,650కోట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ లో ఆయన ఇల్లు 28కోట్ల రూపాయల విలువ ఉంటుందని సమచారం. ఈ ఇంట్లో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, చేపల కోసం చిన్న కొలను, టెన్నిస్ కోర్ట్, గార్డెన్ ఉన్నాయి.
ఇక చిరంజీవి గ్యారేజీలో ప్రఖ్యాత కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా రోల్స్ రాయిస్ గురించి చెప్పుకోవాలి.
Details
చిరంజీవి గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లు
రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom):
ఈ కారును చిరంజీవి 53వ పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా రామ్ చరణ్ అందించారని చెబుతుంటారు. ఈ కారు ధర 8కోట్లకు పైగా ఉంటుంది. ఈ కారును చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారట.
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue):
సెలెబ్రిటీల దగ్గర ఎక్కువగా ఉండే కారు ఇది. చిరంజీవి గ్యారేజీలో ఉన్న ఈ కారు ధర కోటికి పైగానే ఉంటుంది.
టయోటా ల్యాండ్ క్రూజర్(Toyota land cruiser):
ఈ కార్లు చిరంజీవి దగ్గర రెండు ఉన్నాయని సమాచారం. భద్రత పరంగా ఈ కారును ఎక్కువ మంది వినియోగిస్తారు. బయటకు వెళ్లేటపుడు ఎక్కువగా చిరంజీవి ఈ కార్లనే ఉపయోగిస్తారని చెబుతారు.