Loading...
Chiranjeevi Kaka Movie: సంక్రాంతి బరిలో చిరంజీవి.. 'కాకా' డబ్బింగ్‌ పనులు పూర్తి చేయనున్న మెగాస్టార్
సంక్రాంతి బరిలో చిరంజీవి.. 'కాకా' డబ్బింగ్‌ పనులు పూర్తి చేయనున్న మెగాస్టార్

Chiranjeevi Kaka Movie: సంక్రాంతి బరిలో చిరంజీవి.. 'కాకా' డబ్బింగ్‌ పనులు పూర్తి చేయనున్న మెగాస్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో 'కాకా' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ వారంలో డబ్బింగ్‌కు సంబంధించిన బ్యాలెన్స్‌ పార్ట్‌ను పూర్తి చేయనున్నారు. అనంతరం డిసెంబర్‌ 1 నుంచి సినిమా ప్రమోషన్లను భారీ స్థాయిలో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

వివరాలు

పాటలు, టీజర్‌, ట్రైలర్‌తో ప్రచారం

ముందుగా పాటలను విడుదల చేసి.. ఆ తర్వాత టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కథ కూడా ప్రత్యేకంగా ఉండనుందని సమాచారం.

చిరంజీవిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతోనే బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు టాక్‌.

వివరాలు

సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల

'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, బాబీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్‌ కె. నారాయణ, లోహిత్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి 'కాకా' టీమ్‌ సంక్రాంతి విడుదల లక్ష్యంగా పనులు పూర్తి చేస్తోంది.

ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT