
Chiru-Anil: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం.. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హీరో వెంకటేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, అలాగే దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Details
సంగీతాన్ని అందించనున్న బీమ్స్
అనిల్ రావిపూడి తనదైన శైలి కామెడీ, యాక్షన్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిరంజీవి ఇందులో తన అసలు పేరు అయిన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ పాత్ర కోసం అదితి రావు హైదరీని సంప్రదించినట్టు సమాచారం. సంగీతం భీమ్స్ అందిస్తుండగా, చిత్రబృందం వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు #Mega157, #ChiruAnil వర్కింగ్ టైటిల్స్‌గా పరిశీలిస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర'లో నటిస్తుండగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.