Loading...
KAKA : చిరంజీవి 'కాకా'.. యాక్షన్‌ మోడ్‌లోకి మెగాస్టార్‌!
చిరంజీవి 'కాకా'.. యాక్షన్‌ మోడ్‌లోకి మెగాస్టార్‌!

KAKA : చిరంజీవి 'కాకా'.. యాక్షన్‌ మోడ్‌లోకి మెగాస్టార్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి, బ్లాక్‌బస్టర్‌ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కాకా'. 'వాల్తేరు వీరయ్య' వంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో మూవీపై ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం 'కాకా' చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్‌పై భారీ స్థాయిలో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో చిరంజీవి మాస్‌, స్టైలిష్‌ అవతారాల్లో కనిపించనున్నారు. ఆయన మార్క్‌ యాక్షన్‌ ఘట్టాలు థియేటర్లలో అభిమానులకు సాలిడ్‌ విజువల్‌ ట్రీట్‌ అందించడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

స్వరాలను సమకూర్చనున్న తమన్

ఈ చిత్రంలో ప్రియమణి, నివేదా పెతురాజ్‌, అనస్వర రాజన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆయన అందించనున్న మాస్‌ బీజీఎంతో పాటు పాటలు కూడా మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పండగ కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT