LOADING...
Chiranjeevi:  పర్మిషన్ లేకుండా  చిరంజీవి పేరు, ఫొటో వాడకూడదు.. కోర్టు కీలక ఆదేశాలు
చిరంజీవి పేరు, ఫొటో వాడకూడదు.. కోర్టు కీలక ఆదేశాలు

Chiranjeevi:  పర్మిషన్ లేకుండా  చిరంజీవి పేరు, ఫొటో వాడకూడదు.. కోర్టు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) పేరు, ఫొటోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల వేదికలలో తమ పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ప్రముఖ నటులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా AI మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్ ద్వారా వారి ప్రతిష్టకు దెబ్బ తగలిపోతుందని నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తారీఫ్, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Details

విచారణ అక్టోబర్ 27కి వాయిదా

ఏ పరిస్థితులలోనూ చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని హెచ్చరించింది. కోర్టు MEGA STAR, CHIRU, ANNAYYA పేర్లతో AI ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇలాంటి పోస్టులు, వీడియోలను సృష్టించిన 30 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కి వాయిదా పడింది. తాజాగా, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో జరిగిన సమావేశంలో చిరంజీవి ఫిర్యాదు చేశారు. దీనిని సమర్థంగా అమలు చేయడానికి న్యాయ నిపుణుల సలహాలు కోరారు. ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టడానికి చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇరువురు చర్చించారు.

Details

మూవీ షూటింగ్ లో బిజీగా చిరంజీవి

న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు రావడంలో కృషి చేసిన అడ్వకేట్ ఎస్. నాగేశ్ రెడ్డి బృందానికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మన శంకర వరప్రసాద్' సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.