Chiranjeevi: యంగ్ లుక్‌తో చిరంజీవి అదరహో.. క్రియేటివ్ ఫ్యాన్స్‌కు బంపర్ ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) నుంచి చిత్ర బృందం తాజాగా సరికొత్త హెచ్‌డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఫొటోల్లో చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో అదరగొడుతుండగా, అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులను మరింత ఉత్తేజపరుస్తూ ఓ ప్రత్యేక పోటీని కూడా ప్రారంభించారు.
Details
ప్రత్యేకమైన బహుమతిని అందిస్తాం
విడుదల చేసిన కొత్త స్టిల్స్‌ను ఉపయోగించి క్రియేటివ్ డిజైన్లు రూపొందించాలని, వాటిలో ఉత్తమంగా ఎంపికైన వారికి ప్రత్యేకమైన 'MSG' మర్చండైజ్‌ను బహుమతిగా అందిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో చిరంజీవికి జోడీగా నయనతార, కేథరిన్ త్రెసా నటిస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల కలయిక ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి పండుగకు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.