Page Loader
ఎయిర్ పోర్టులో అభిమానిని నెట్టేసిన చిరు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఎయిర్ పోర్టులో అభిమానిని నెట్టేసిన చిరు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

ఎయిర్ పోర్టులో అభిమానిని నెట్టేసిన చిరు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2024
07:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులుగా పారిస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పారిస్ అందాలను ఆస్వాదించడంతో పాటు ఒలింపిక్స్ వేడుకల్లో పాల్గొని సందడి కూడా చేశారు. ఈ వెకెషన్‌కు చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ దంపతులకు కూడా వెళ్లారు. ఇక వెకెషన్ తర్వాత తిరిగి హైదరాబాద్ కు చిరంజీవి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో చిరంజీవి కనపడటంతో సెల్పీ కోసం సిబ్బంది ముందుకొచ్చారు. అయితే చిరంజీవి తనను పట్టించుకోలేదు. అలాగే ఆ వ్యక్తి మరోసారి ముందుకొచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తిని చిరంజీవి నెట్టేశాడు.

Details

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు

ఈ ఘటనను మరో వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి నాలుగు రోజు క్రితం నాగార్జున కూడా సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేశాడు. తర్వాత దీనిపై భారీగా ట్రోల్ జరగడంతో నాగార్జున క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియోపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.