Megastar Chiranjeevi: దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి.. మాస్ ఫ్యాన్స్‌కి పండగే!
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించడంలో ముందు ఉంటాడు. ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్న చిరంజీవి, తన నెక్ట్స్ సినిమా ఛాన్స్ 'దసరా' మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇచ్చారు. నానిని మాస్ లుక్‌లో చూపించి పెద్ద హిట్ అందించిన శ్రీకాంత్, చిరంజీవిని మరింత మాస్ అవతార్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో 'ప్యారడైజ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిరంజీవికి కథ వినిపించిన శ్రీకాంత్, మెగా కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభం
ఎట్టకేలకు చిరంజీవి నుంచి ఓకే రావడంతో, శ్రీకాంత్ కోరిక సఫలమైంది. ఫిబ్రవరి నుండి ప్రారంభమైన 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విశ్వంభర షూటింగ్ పూర్తయ్యాకే చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల మూవీ పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. చిరంజీవి వీరాభిమాని అయిన శ్రీకాంత్, మెగాస్టార్‌తో పని చేసే అవకాశం తన జీవితంలో ప్రత్యేక ఘట్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.