
Chiranjeevi : చిరు మాస్ సాంగ్ రెడీ.. మరోసారి పాట పాడనున్న మెగాస్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను మరింత వినోదభరితంగా మార్చేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు.
అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత, మరోసారి అదే ఎనర్జీతో చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
2026 సంక్రాంతికి నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్న ఈ మూవీ, ప్రేక్షకులకు మళ్లీ ఓ వినోదోత్సవాన్ని అందించనుంది.
ఈ సినిమా కథ, చిరంజీవి క్యారెక్టర్, పాత్రల వివరాలపై పూర్తి సస్పెన్స్ ఉంచిన అనిల్ రావిపూడి, మెగాఫ్యాన్స్‌కు ఓ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఉగాది సందర్భంగా గ్రాండ్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరిపిన టీమ్, ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
Details
మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయినట్లు సమాచారం
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేష్‌తో బేసికలీ.. ప్రాక్టికలీ.. టెక్నీకలీ అనే పాటను పాడించడమే కాకుండా, ఆ పాటను సూపర్‌హిట్‌గా మార్చిన అనిల్ రావిపూడి, ఇప్పుడు అదే ప్రయోగాన్ని మెగాస్టార్‌తో చేయబోతున్నారని సమాచారం.
చిరంజీవితో ఓ మాస్ సాంగ్ పాడించేందుకు ఇప్పటికే మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
గతంలో చిరు పాడిన కొన్ని పాటలు మంచి హిట్ అయిన నేపథ్యంలో, ఈ కొత్త మాస్ సాంగ్ ఎంత భారీ హిట్ అవుతుందో తెలుసుకోవాలంటే, పాట రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే!