
Mega 157: కేరళ వేదికగా చిరు-నయనతార రొమాంటిక్ సాంగ్ షూటింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న చిత్రం పనులను అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం మూడవ షెడ్యూల్ కేరళలోని అలప్పుజాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ నయనతారపై ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ మెలోడియస్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. సాంగ్ ట్యూన్ గురించి ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
Details
తదుపరి షెడ్యూల్ ఆగస్టులో
ఈ షెడ్యూల్ జూలై 23 వరకు కొనసాగనుండగా, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆగస్టులో ప్రారంభమవుతుంది. సంక్రాంతి విడుదల లక్ష్యంగా షూటింగ్‌ను దాదాపు డెడ్‌లైన్‌కు ముందే పూర్తిచేయాలని చిత్ర బృందం కృషి చేస్తోంది. ఇక ఓటీటీ హక్కుల విషయానికి వస్తే, ఈ చిత్రానికి భారీ రేటుకు డీల్స్ జరుగుతున్నాయని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.