
Chiranjeevi-Pawan: చిరు- పవన్ కలిసి నటించాలి : రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన తాజా పోస్ట్‌తో మెగా అభిమానుల దృష్టిని ఆకర్షించారు. చిరంజీవి (Chiranjeevi) తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' (Pranam Khareedu) విడుదలై సెప్టెంబర్ 22తో 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని వర్మ రీషేర్ చేశారు. ఈ సందర్భంలో చిరు-పవన్ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 'మీరిద్దరూ కలిసి నటిస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ ఉత్సాహాన్ని పంచుతుంది. ఆ చిత్రం ఈ శతాబ్దంలోనే అత్యంత మెగా పవర్ మూవీ అవుతుందంటూ వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Details
చిరుకు శుభాకాంక్షల వెల్లువ
ప్రస్తుతం ఆయన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే నిజమైతే ఈ మల్టీ స్టారర్‌కు ఎవరు దర్శకత్వం వహించాలి అనే చర్చ నెటిజన్లలో జోరందుకుంది. ఇక చిరంజీవి నటించిన తొలి సినిమా 47 ఏళ్ల మైలురాయి సాధించిన సందర్భంలో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు. అన్నయ్యపై తన అభిమానం తెలియజేసిన పవన్ కళ్యాణ్ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. చిరంజీవి పుట్టుకతోనే యోధుడని, ఆయనకు రిటైర్మెంట్ అన్నది ఉండదని ప్రశంసలు కురిపించారు. పవన్ పోస్ట్‌కు స్పందించిన చిరు.. ఆ మాటలు తనను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయని పేర్కొన్నారు.