The Odyssey Trailer: నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ వచ్చేసింది.. సముద్ర యాత్రలో అబ్బురపరిచే దృశ్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'ది ఒడిస్సీ'పై అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ సినీ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ట్రోజన్ యుద్ధం అనంతరం ఒడిస్సీ చేసిన సముద్ర యాత్రను అద్భుత దృశ్యాలతో చూపిస్తూ ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విస్తారమైన సముద్ర దృశ్యాలు, పురాతన కాలానికి చెందిన వింత జీవులు, యోధుల మధ్య పోరాటాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. దీనికి లుడ్విగ్ గోరాన్సన్ అందించిన నేపథ్య సంగీతం మరింత ఉత్కంఠను పెంచుతోంది.
వివరాలు
IMAX కెమెరాలతో సినిమా షూట్
కథన నిర్మాణంలో తన ప్రత్యేక విధానంతో ప్రసిద్ధి చెందిన నోలన్, ఈ చిత్రాన్ని విభిన్న క్రమంలో చెప్పే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో Matt Damon ప్రధాన పాత్రలో కనిపించనుండగా, Tom Holland కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే Anne Hathaway పెనెలోప్ పాత్రలో నటిస్తుండగా, Zendaya, Charlize Theron ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ పరంగా ఈ సినిమాను పూర్తి స్థాయిలో IMAX కెమెరాలతో షూట్ చేయడం విశేషం. నోలన్ సినిమాల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
వివరాలు
ఈ ఏడాది జూలై 17 ప్రపంచవ్యాప్తంగా విడుదల
చిత్ర ప్రచారంలో భాగంగా The Late Show కార్యక్రమంలో పాల్గొన్న నోలన్, కాలం,స్థలానికి అతీతంగా ఈ కథను విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. విశ్వవ్యాప్త ఆకర్షణ కలిగిన ఈ పురాణ గాథను తన శైలిలో ఎలా రూపుదిద్దుతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రం జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. వెండితెరపై అద్భుత దృశ్యానుభూతి అందించనున్న చిత్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది.