Christopher nolan: నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ విడుదల.. అంచనాలు మరింత పెంచిన విజువల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' నుంచి తాజా కౌంట్‌డౌన్ ట్రైలర్ విడుదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రీకు పురాణ గాథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.
వివరాలు
ప్రత్యేకమైన విజువల్ ట్రీట్..
ట్రోజన్ యుద్ధం అనంతరం ఇథాకా రాజు ఒడిస్సియస్ తన స్వదేశానికి, భార్య వద్దకు చేరుకోవడానికి దాదాపు పదేళ్ల పాటు సాగించిన సాహసోపేతమైన ప్రయాణం ఈ చిత్ర ప్రధాన కథాంశం. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఉధృతమైన సముద్ర తుపానులు, భీకరమైన రాక్షసులతో జరిగే పోరాటాలు, భారీ యుద్ధ సన్నివేశాలను అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. నోలన్‌కు ప్రత్యేకమైన విజువల్ ట్రీట్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా నిలిపింది.
వివరాలు
17న థియేటర్లలో విడుదల..
ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రను ప్రముఖ నటుడు మాట్ డామన్ పోషించగా, అతని భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే నటిస్తోంది. అలాగే టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, షార్లిజ్ థెరాన్ తదితర ప్రముఖ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 17న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.