Page Loader
సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా అదేనంటూ దర్శకుడు మిస్కిన్ కామెంట్స్ 
లోకేష్ దర్శకత్వంలోని సినిమాతో సినిమాలకు రజనీ ఫుల్ స్టాప్ అంటూ వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా అదేనంటూ దర్శకుడు మిస్కిన్ కామెంట్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 18, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా గురించి చాలా రోజులుగా అనేక కథనాలు వస్తున్నాయి. కాలా సినిమా నుండి రజనీకాంత్ ఏ సినిమా తీసిన అదే తన లాస్ట్ సినిమా అని వార్తలు వచ్చాయి. ఈసారి రజనీకాంత్ లాస్ట్ సినిమా చర్చల్లోకి రావడానికి తమిళ దర్శకుడు మిస్కిన్ కారణమవుతున్నాడు. ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు మిస్కిన్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా ఉండే అవకాశం ఉందని, అదే రజనీకాంత్ లాస్ట్ సినిమా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అన్నాడు. మిస్కిన్ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

Details

జై భీమ్ దర్శకుడితో సినిమా పూర్తికాగానే లోకేష్ కనకరాజ్ తో సినిమా మొదలు 

ప్రస్తుతం రజనీకాంత్, జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్లో 169వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా, ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్నారు. జైలర్ తో పాటు లాల్ సలామ్ అనే చిత్రంలోని నటిస్తున్నాడు రజనీకాంత్. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. లాల్ సలాం సినిమా నుండి ఈమధ్య రజనీకాంత్ లుక్ బయటకు వచ్చింది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించనున్నాడు రజనీకాంత్. ఇవన్నీ పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా ఉంటుందని, ఇంతవరకు ఎవ్వరూ ఊహించని రీతిలో ఆ సినిమా తెరకెక్కుతుందని దర్శకుడు మిస్కిన్ అన్నారు.