Page Loader
Citadel: వెబ్‌సిరీస్‌ నుంచి సినిమాగా 'సిటడెల్‌' పార్ట్‌ 2.. వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వెబ్‌సిరీస్‌ నుంచి సినిమాగా 'సిటడెల్‌' పార్ట్‌ 2.. వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Citadel: వెబ్‌సిరీస్‌ నుంచి సినిమాగా 'సిటడెల్‌' పార్ట్‌ 2.. వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'సిటడెల్: హనీ-బన్నీ'. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సిరీస్‌లో వరుణ్ 'బన్నీ'గా ఏజెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా వరుణ్ సిరీస్ రెండో భాగం గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ఓ అభిమాని 'సిటడెల్ పార్ట్ 2 ఎప్పుడు రాబోతోంది'? అని ప్రశ్నించారు. దీనిపై వరుణ్ స్పందించారు. ప్రస్తుతం తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, కానీ సిటడెల్ మేకర్స్ రెండో భాగంపై చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టమైన నిర్ణయం వస్తుందన్నారు.

Details

జాన్వీ కపూర్ గొప్ప నటి : వరుణ్

దీంతో ఈసారి వెబ్ సిరీస్‌ను థియేటర్‌లో చూడొచ్చని సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా, ఓ అభిమాని జాన్వీ కపూర్ గురించి మాట్లాడారు. దీనిపై వరుణ్, ఆమె ఒక గొప్ప నటి అని, ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉందని తెలిపారు. మరోవైపు, సిటడెల్ సిరీస్ హాలీవుడ్ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించగా, ప్రియాంక ఇటీవల ఆ షూటింగ్ సెట్ నుండి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చిత్రీకరణ సమయంలో తన చేతులకు గాయాలైనట్లు ఆమె పేర్కొంది.