LOADING...
Nandamuri Balakrishna : 'అఖండ 3' పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ కూడా రివీల్!
'అఖండ 3' పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ కూడా రివీల్!

Nandamuri Balakrishna : 'అఖండ 3' పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ కూడా రివీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన భారీ చిత్రం 'అఖండ 2: తాండవం' ఈ రోజు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన బ్లాక్‌బస్టర్ 'అఖండ' కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు నెలకొల్పిన అంచనాలు అంత కంటే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సందడి చేస్తున్నారు.

 Details

అద్భుతమైన సర్‌ప్రైజ్ అంటూ హింట్

సినిమాలోని బాలయ్య నటన, డైలాగ్స్ కు మంచి స్పందన వస్తోందని, వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫలితంగా 'అఖండ 2' హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమాను చూసిన ప్రేక్షకులకు చివర్లో చిత్రబృందం ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో మూడో భాగం రాబోతుందనే హింట్ ఇచ్చారు. 'జై అఖండ' పేరుతో 'అఖండ 3' ఖరారైపోవడం, బాలయ్య-బోయపాటి కలయికలో మరో పవర్‌ఫుల్ సినిమా రానునుండటంతో అభిమానులు ఆత్మీయంగా ఆనందిస్తున్నారు

Advertisement