LOADING...
Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల! 
తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!

Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'తమ్ముడు' సినిమా విడుదల తేదీపై మరోసారి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేస్తామని యూనిట్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్‌ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' మూవీ విడుదల జులై 4 నుంచి వాయిదా పడింది. అదే రోజున పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో 'తమ్ముడు' సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి.

Details

జూన్ 4న రిలీజ్

ఈ నేపథ్యంలో తమ్ముడు టీమ్‌ స్పందిస్తూ ఈ రూమర్లను పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. 'మా సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. జులై 4న తమ్ముడు సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఏ సినిమా వచ్చినా, ఎప్పుడు విడుదలైనా మా డేట్‌ కంటే ముందు ప్రకటించాం. అందుకే మా నిర్ణయానికి ఎలాంటి మార్పు ఉండదని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

Details

రిలీజ్ డేట్ మార్చే ప్రసక్తే లేదు

ఈ సినిమాపై ఇప్పటికే తక్కువ బడ్జెట్‌తో కూడిన మంచి కంటెంట్‌ సినిమాగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్‌ లయ ఈ మూవీతో రిఇంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. నితిన్‌ కూడా ఈ సినిమాతో హిట్‌ కొట్టాలనే ధృఢ సంకల్పంతో ఉన్నాడు. అయితే, ఒకవేళ వీరమల్లు జులై 4న వస్తే, తమ్ముడు, కింగ్‌డమ్‌ చిత్రాలు వీరమల్లుతో పోటీ పడే అవకాశాలు తప్పవు. అయినా కూడా తమ్ముడు రిలీజ్ డేట్‌ మార్చే ప్రసక్తే లేదని స్పష్టమైంది.