Varanasi : వారణాసి రిలీజ్ డేట్ రివీల్‌పై క్లారిటీ.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఖచ్చితమైన విడుదల తేదీ విషయంలో ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ కీలక అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే తీపి కబురు అందనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Details
మార్చి 26న అనౌన్స్‌మెంట్
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీని ప్రకారం మార్చి 26న ఈ మెగా అనౌన్స్‌మెంట్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రంతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.