Page Loader
WAR 2 : వార్ 2 తెలుగు రిలీజ్‌పై క్లారిటీ.. నాగవంశీ అధికారిక ప్రకటన!
వార్ 2 తెలుగు రిలీజ్‌పై క్లారిటీ.. నాగవంశీ అధికారిక ప్రకటన!

WAR 2 : వార్ 2 తెలుగు రిలీజ్‌పై క్లారిటీ.. నాగవంశీ అధికారిక ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'బ్రహ్మాస్త్ర' ఫేం ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై జాతీయస్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్) సొంతం చేసుకున్నారు.

Details

అత్యంత ధర పలికిన రికార్డుగా 'వార్ 2'

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ డబ్బింగ్ హక్కుల కోసం దాదాపు రూ. 90 కోట్ల భారీ డీల్ క్లోజ్ అయినట్లు టాక్. దీంతో తెలుగు డబ్బింగ్‌ హక్కులకు ఇప్పటివరకు పలికిన అత్యధిక ధరగా 'వార్ 2' నిలిచింది. ఎన్టీఆర్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ స్థాయిలో రేటు పలికినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకు నాగవంశీ ఎన్టీఆర్‌తో కలిసి 'అరవింద సమేత వీర రాఘవ', 'దేవర' సినిమాలను తీసుకొచ్చారు.

Details

తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు భారీ ప్లాన్

ఇప్పుడు మూడోసారి 'వార్ 2'తో ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్ అవుతోంది. 'దేవర'కు తెల్లవారుజామున షోలు ఏర్పాటు చేసినట్టుగానే, 'వార్ 2'కూ అదే రేంజ్‌లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను భారీగా చేయాలని సిద్ధం అవుతున్నారు. మొత్తానికి, ఎన్టీఆర్ పవర్, హృతిక్ స్టైల్, ఆయాన్ దృక్పథం కలిసి వస్తున్న 'వార్ 2'.. తెలుగు ప్రేక్షకులకూ ఊహించని మాస్ ట్రీట్ ఇవ్వబోతోంది.