Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు అరుదైన అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'.
ఈ సినిమాను యదు వంశీ దర్శకత్వం వహించగా, ఇందులో 11 మంది హీరోలు,ముఖ్యంగా సందీప్ సరోజ్,యశ్వంత్ పెండ్యాల,ఈశ్వర్ రాచిరాజు,త్రినాధ్ వర్మ,ప్రసాద్ బెహరా,మణికంఠ పరసు,లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా నటించారు. అలాగే నలుగురు హీరోయిన్‌లు కూడా భాగం అయ్యారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ నందిపాటి థియేటర్స్‌లో విడుదల చేయగా,దాని డిఫరెంట్ కంటెంట్, పల్లెటూరి వాతావరణం, స్నేహం,ప్రేమ,కుటుంబంలోని భావోద్వేగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా 'కమిటీ కుర్రోళ్ళు' బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
వివరాలు
మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డు
ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అటు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం, ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను మళ్లీ అలరిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, 'కమిటీ కుర్రోళ్ళు' త్వరలో దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్-ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్ అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డును అందుకోబోతుంది.
ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, మెగా ఫ్యాన్స్ ఈ వార్తతో ఆనందంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.