LOADING...
Peddi : మెగా ఫ్యాన్స్‌కు షాక్.. 'పెద్ది' వాయిదా.. అసలు కారణాలు ఇవే!
మెగా ఫ్యాన్స్‌కు షాక్.. 'పెద్ది' వాయిదా.. అసలు కారణాలు ఇవే!

Peddi : మెగా ఫ్యాన్స్‌కు షాక్.. 'పెద్ది' వాయిదా.. అసలు కారణాలు ఇవే!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని నిర్మాతలు ముందుగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొద్దిపాటి సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుమారు సగం పూర్తయినట్లు సమాచారం. నిజానికి ముందుగా నిర్ణయించిన సమయానికే సినిమా సిద్ధమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మేకర్స్ భావిస్తున్నారు.

వివరాలు 

అందుకే ఆలస్యంగా విడుదల

తొందరపడి విడుదల చేయడం కంటే, ప్రేక్షకులకు అత్యుత్తమమైన దృశ్యానుభూతిని అందించడం లక్ష్యంగా మరికొంత సమయం తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీజీ వర్క్ విషయంలో ప్రతి సన్నివేశం అత్యంత ఖచ్చితంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిత్రబృందం కృషి చేస్తోంది. ఈ పనులు పూర్తవడానికి అదనపు సమయం అవసరమవుతోంది. అదే విధంగా సంగీత దర్శకుడు రెహమాన్ అందిస్తున్న నేపథ్య సంగీత పనులు కూడా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. దీంతో తొందరపడకుండా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్..

ఓ వైపు సీజీ వర్క్, మరోవైపు మ్యూజిక్ విషయంలో మరింత ఆలస్యం అవ్వడం వల్లే విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే ఈ వాయిదాపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అన్ని పనులు పూర్తైన తర్వాత కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ప్రత్యేకమైన మేకోవర్‌తో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement