LOADING...
Coolie : కూలీ ఫస్ట్ డే గ్రాస్‌ రివీల్‌.. తొలి రోజే రజనీ మరో రికార్డు
కూలీ ఫస్ట్ డే గ్రాస్‌ రివీల్‌.. తొలి రోజే రజనీ మరో రికార్డు

Coolie : కూలీ ఫస్ట్ డే గ్రాస్‌ రివీల్‌.. తొలి రోజే రజనీ మరో రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' చిత్రం, సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో నిన్న విడుదలైంది. అదే రోజు ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'వార్‌ 2'తో పోటీగా బరిలోకి దిగింది. కూలీ vs వార్‌ 2 పోటీ "నువ్వా.. నేనా?" అన్నట్టుగా సాగింది. అయితే లోకేష్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌ క్రేజ్‌కు రజనీకాంత్‌ మాస్‌ పవర్‌ తోడవడంతో, కూలీ మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే కూలీకి ఇండియాలో తొలి రోజు రూ. 65 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Details

య్యెస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా కూలీ రికార్డు 

ఇందులో తమిళనాడులో నుంచే రూ. 45 కోట్లు, తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 15 కోట్లు, హిందీ వెర్షన్‌ ద్వారా రూ. 4 కోట్లకు పైగా వచ్చాయని సమాచారం. ఇక మేకర్స్‌ అయిన సన్‌ పిక్చర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించిన ప్రకారం, మొదటి రోజు రూ. 151 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ వసూళ్లతో రజనీకాంత్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తమిళ సినిమా చరిత్రలో మొదటి రోజు హయ్యెస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా కూలీ రికార్డ్‌ సొంతం చేసుకుంది. రజనీకాంత్‌ రికార్డులు క్రియేట్‌ చేయడమే కాదు... బద్దలు కొడతాడు అని చెప్పేలా ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Details

రికార్డు స్థాయిలో వసూలు

రజనీకాంత్‌, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌, సౌబిన్‌ షాహిర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, రెండో రోజుకూడా భారీ స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సాధిస్తోంది. ఇదే హైప్‌, కలెక్షన్ల ట్రెండ్‌ కొనసాగితే, కోలీవుడ్‌ ఇండస్ట్రీ కలగా చూసే వెయ్యి కోట్ల మార్క్‌ చేరుకోవడం అసాధ్యం కాదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.