
Coolie: ఓటీటీలోకి వచ్చిన కూలీ.. ఎక్కడ చూడాలంటే..
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "కూలీ". భారీ అంచనాలతో, పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకంగా ఆగస్ట్ 14న భారీ ఉత్సాహంతో విడుదల అయ్యింది. విడుదలకి ముందే టీజర్, ట్రైలర్ ద్వారా భారీ హైప్ క్రియేట్ అయినప్పటికీ, థియేటర్లలోకి విడుదలైన తర్వాత అందరూ ఎదురుచేసిన మిరాకిల్ కానీ ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా తీర్చిదిద్దినప్పటికీ రజనీకాంత్‌కు తగిన భావోద్వేగం (ఎమోషన్) లేదా సినిమా ఎలివేషన్ కనిపించలేదు అనే విమర్శలు వినిపించాయి. కథ నైతికత లేకపోవడం,రజినీకాంత్ సినిమాలకు ప్రత్యేకంగా గుర్తుగా ఉన్న పంచ్ డైలాగ్స్ లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
వివరాలు
రూ. 500 కోట్లకు పైగా గ్రాస్
లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ యూనివర్స్‌లో గడచిన మూడు సినిమాలు భారీ హిట్‌గా నిలిచినప్పటికీ, ఈ "కూలీ" సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయినప్పటికీ, థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, తమిళనాడులో కొత్త రికార్డులు సృష్టించింది. కానీ తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం బయ్యర్స్ కు ఆశించిన లాభం అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. విడుదలకి ముందుగానే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది.
వివరాలు
సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్‌లో
ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో, థియేటర్లు లో విడుదలైన 28 రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది. థియేటర్స్ లో మిశ్రమ స్పందన పొందిన "కూలీ" ఈసారి ఓటీటీ ద్వారా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ఆసక్తిగా చూడాల్సి ఉంటుంది.