Page Loader
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!
అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప 2' మూవీ రిలీజ్‌కు దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, శ్రీలీల పాత్రలకు సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ట్రైలర్ విడుదల తేదీని వెల్లడించింది. నవంబర్ 17న సాయంత్రం 6:03 గంటలకు బిహార్‌లోని పాట్నా గాంధీ మైదాన్‌లో పుష్ప 2 ట్రైలర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.

Details

రేపే ట్రైలర్ రిలీజ్

ఈ సందర్భంగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పుష్ప గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించడంతో సీక్వెల్‌పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయనుంది.

Embed

పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

#Pushpa2TheRuleTrailer out Tomorrow at 6:03 PM. pic.twitter.com/xxrTwQdNez— Allu Arjun (@alluarjun) November 16, 2024