Page Loader
Arjun s/oVyjayanthi: కౌంట్‌డౌన్ స్టార్ట్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ రేపే విడుదల
కౌంట్‌డౌన్ స్టార్ట్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ రేపే విడుదల

Arjun s/oVyjayanthi: కౌంట్‌డౌన్ స్టార్ట్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ రేపే విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయోగాత్మక చిత్రాల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కల్యాణ్ రామ్, ఇప్పుడు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి వ్యతిరేకంగా పోరాడే కథాపరిశ్రమలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై నందమూరి అభిమానులు సహా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.

Details

ఏప్రిల్ 18న మూవీ రిలీజ్

సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. తాజాగా చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌ను షేర్ చేసింది. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ట్రైలర్‌ను ఏప్రిల్ 12 సాయంత్రం 7:59 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్ 18, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కూడా చిత్రబృందం స్పష్టం చేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు మరింత ఊపందుకున్నాయి. సినిమాపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి!