Loading...
NTR Anil Ravipudi Movie: క్రేజీ కాంబో ఫిక్స్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌!
క్రేజీ కాంబో ఫిక్స్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌!

NTR Anil Ravipudi Movie: క్రేజీ కాంబో ఫిక్స్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ సిద్ధమవుతోంది. యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని శనివారం తారక్‌ అధికారికంగా వెల్లడించారు. అనిల్‌ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను ఎక్స్‌ వేదికగా పంచుకుంటూ.. 'నవ్వుల విందు సిద్ధమవుతోంది' అని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత అనిల్‌ రావిపూడి ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది.

వివరాలు

2027 సంక్రాంతికి అనిల్‌ రావిపూడి సినిమా

మరోవైపు అనిల్‌ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌లతో కలిసి 'జనవరి 12న విడుదల' అనే సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ తర్వాత ఎన్టీఆర్‌తో అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT