Page Loader
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం క్రెజీ టైటిల్‌!
వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం క్రెజీ టైటిల్‌!

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం క్రెజీ టైటిల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు హిట్‌లు సాధించనున్నా, యంగ్ హీరోలు వరుసగా ప్లాప్స్‌తో సతమతమవుతున్నారు. వారిలో ఒకరు వరుణ్ తేజ్. మూడేళ్ల నుండి ఆయనకు ఒక్క హిట్టు కూడా రాలేదు. గని, గాండీవ దారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి సోలో సినిమాలు అతడి కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మట్కా చిత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా వరుణ్ వెనకడుగు వేయడం లేదు. తన పుట్టినరోజు సందర్భంగా (జనవరి 19న) మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈసారి 'మట్కా' చిత్రానికి నేషనల్ టచ్ ఇచ్చిన వరుణ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Details

'కొరియన్ కనకరాజు' టైటిల్ ఫిక్స్

వరుణ్ ఇప్పుడు కామెడీ, హార్రర్‌లో ప్రయోగం చేయనున్నారు. ఈ మూవీకి 'కొరియన్ కనకరాజు' అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఈ సినిమా విజయం సాధిస్తే వరుణ్ తేజ్ కెరీర్‌ను పుంజుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.