ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రత్యేకమైన రోజు: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రం, ఈ నెల 16న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రానికి మొదటిరోజున 140కోట్ల వసూళ్ళు వచ్చినట్టు సమాచారం. ప్రభాస్ కెరీర్లో మొదటిరోజున వందకోట్లకు పైగా వసూళ్ళు సాధించిన మూడవ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయో, విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. నేపాల్ లోని ఖాట్మాండు, పోఖారా నగరాల్లో ఆదిపురుష్ ప్రదర్శనలు నిలిపివేసారు. అదంతా అలా ఉంచితే, ప్రస్తుతం ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై చర్చ జరుగుతోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీన ఓటీటీలోకి ఆదిపురుష్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఓటీటీలోకి ఆదిపురుష్ చిత్రం రాబోతుందని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ పుకార్లు మాత్రం పుట్టుకొస్తున్నాయి. నిజానికి సినిమా రిలీజైన 8వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో వినిపించింది. కానీ సడెన్ గా ఆ నిర్ణయంలో మార్పు జరిగినట్లు తోస్తుంది. ఆదిపురుష్ చిత్రంలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త నాగి, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మించాయి.