
నాని 30 మూవీపై క్రేజీ అప్డేట్.. సముద్రం తీరంలో స్టైలిష్ లుక్‌లో నాని
ఈ వార్తాకథనం ఏంటి
దసరా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను నటిస్తున్న తాజా చిత్రం నాని 30 (Nani 30) పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
డెబ్యూ డైరక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఇప్పటికే గోవా, ముంబైలో నాని షెడ్యూల్ ను పూర్తి చేశాడు.
మరింత లవ్, ఫ్యాషన్‌తో ఎక్జయిటింగ్ ముంబై షెడ్యూల్ పూర్తయింది. త్వరలో ఓ మ్యాజిక్ ను షేర్ చేస్తామని వైరా ఎంటర్ టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.
అయితే కనూర్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం రెడీ అవుతున్నట్లు ఆ పోస్టర్‌లో వివరించారు.
Details
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న మూవీ
ముంబై తీర ప్రాంతంలో నాని నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోను వైరా ఎంటర్ టైన్‌మెంట్స్ పోస్టు చేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
ఈ సినిమాకు ఇంకా టైటిట్ ను ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియోను పోస్టు చేసిన వైరా ఎంటర్ టైన్ మెంట్
After Goa, with even more love and passion, #Nani30 wraps up an exciting schedule in Mumbai ❤️. We can’t wait to share the magic with you soon!! 🤗
— Vyra Entertainments (@VyraEnts) June 1, 2023
Natural🌟 @NameisNani @mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @TSeries pic.twitter.com/KJ7bO8MYeH