Page Loader
Ram Charan: 'RC 16'లో క్రికెట్ లెజెండ్ ధోనీ?.. స్పందించిన మూవీ టీమ్!
'RC 16'లో క్రికెట్ లెజెండ్ ధోనీ?.. స్పందించిన మూవీ టీమ్!

Ram Charan: 'RC 16'లో క్రికెట్ లెజెండ్ ధోనీ?.. స్పందించిన మూవీ టీమ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'RC 16' సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అని ప్రచారం జరుగుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ క్రికెట్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్‌లో షూట్ చేసినట్లు సమాచారం.

Details

గతంలో కూల్‌డ్రింక్ యాడ్‌లో కనిపించిన రామ్ చరణ్, ధోని

అయితే ఈ సినిమా కోసం ధోనీని తీసుకున్నారని, ఆదివారం రామ్ చరణ్ ముంబైలో కనిపించడం, వెంటనే ఈ వార్త వైరల్ కావడం గమనార్హం. దీంతో #RC16 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.అసలే రామ్ చరణ్, ధోనీ మంచి స్నేహితులు. గతంలో ఒక కూల్‌డ్రింక్ యాడ్‌లో కలిసి నటించారు. అంబానీ ఫ్యామిలీ ఈవెంట్స్‌లో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతీ తెలిసిందే. అంతేకాకుండా, ధోనీకి సినిమాలపై ఆసక్తి ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ధోనీ ఎంటర్టైన్మెంట్స్' పేరుతో తమిళ సినిమాను నిర్మించాడు.

Details

రూమర్స్ కి ఫుల్ స్టాప్

ఈ నేపథ్యంలో ధోనీ నటిస్తారనే ప్రచారం నిజమేనేమో అని చాలామంది అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతోంది. 'RC 16' యూనిట్ ధోనీ సినిమాలో నటించడం లేదని, అలాంటి పాత్ర కూడా స్క్రిప్ట్‌లో లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రూమర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్లైంది. అయితే, ఈ మూవీలో క్రికెట్ సీన్స్ ఉన్న నేపథ్యంలో ధోనీ స్పెషల్ క్యామియో చేస్తే బాగుంటుందనేది ఫ్యాన్స్ కోరుతున్నారు.