Nagarjuna Akkineni: నాగార్జునపై క్రిమినల్ కేసు.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరాలు
సినీ నటుడు అక్కినేని నాగార్జునపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సీనియర్ నటుడు నాగార్జున సమంత-నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఆయన హెచ్చరిక చేసిన మరుసటి రోజే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నాగార్జునపై కేసు నమోదు కావడం గమనార్హం. తమ్మిడికుంట ప్రాంతంలో అక్రమ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారనే ఆరోపణల మేరకు కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును జనంకోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్లు తెలుస్తోంది.
న్యాయం జరిగే వరకు సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదు : నాగార్జున
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాగార్జునపై కక్ష సాధింపు సాధిస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఎన్ కన్వెన్షన్ భవనాన్ని కూల్చివేసారు. ఆ సమయంలో నాగార్జున తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం, సమంతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి సమస్యను ముదిర్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు, పరువు నష్టం దావా వేశారు. నాగార్జున తనకు న్యాయం జరిగే వరకు సైలెంట్‌గా ఉండే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.