Page Loader
Daaku Maharaj: 'డాకు మహారాజ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. ఎందుకంటే..?
'డాకు మహారాజ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. ఎందుకంటే..?

Daaku Maharaj: 'డాకు మహారాజ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. నందమూరి అభిమానులు ఈ చిత్ర విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించాల్సి ఉండగా, మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ బుధవారం తిరుపతిలో వైకుంఠ దర్శన టోకెన్లు పంపిణీ సమయంలో క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో, ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

జనవరి 12న వరల్డ్ వైడ్‌గా విడుదల 

ఈ విషయం గురించి నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటన చేశారు. అయితే, ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లో మరో ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్