Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తెలుగు వారు వీరే..
భారతీయ చిత్రసీమలో అత్యంత గౌరవప్రదమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారతీయ సినిమా రంగానికి అసాధారణ సేవలు చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. 1969 నుంచి, దాదాసాహెబ్ ఫాల్కే అందించిన సేవలకు స్మారకంగా ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు ఈ గౌరవం అందజేస్తారు. 1990లో అక్కినేని నాగేశ్వర్ రావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన 1941లో విడుదలైన "ధర్మపత్ని" సినిమాతో సినీరంగంలో అడుగు పెట్టారు. తన కెరీర్‌లో సుమారు 250కు పైగా చిత్రాలలో నటించారు. దేవదాసు, ప్రేమనగర్, మూగ మనసులు, మాయాబజార్ వంటి ఎన్నో ప్రఖ్యాత సినిమాలలో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ కి దాదాసాహెబ్ ఫాల్కే
2009లో డి. రామానాయుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 150కి పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ వంటి 9 భాషల్లో సినిమాలు నిర్మించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. 2016లో కళాతపస్వి కె. విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రధానంగా సంగీతం, నాట్యం పైన ఆధారపడి ఉంటాయి. ఆయన రూపొందించిన "శంకరాభరణం" చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు పొందింది. తెలుగు సినీరంగం నుంచి ఎల్.వి. ప్రసాద్, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బి. నాగిరెడ్డి లాంటి మహానుభావులు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు.