Daaku Maharaaj: 'డాకు మహారాజ్' క్రిస్మస్ స్పెషల్ పోస్టర్.. హైప్ పెంచేసిన చిత్రయూనిట్
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్‌లో చిత్రంలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు. బాలకృష్ణ ఒక వైపు గండ్రగొడ్డలి చేతబట్టి కనిపించగా, మరోవైపు ఊర్వశి రౌటేలా పిస్తోల్ పట్టి ఉన్నారు. బాబీ డియోల్, ప్రగ్యాజైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు రిలీజయ్యాయి.
విలన్ పాత్రలో బాబీ డియోల్
తాజా లుక్ ఈమూవీపై భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన హై ఎనర్జిటిక్, ఫియర్‌స్ ట్రాక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.