Page Loader
DaakuMaharaaj : హై వోల్టేజ్ యాక్షన్‌తో 'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల 

DaakuMaharaaj : హై వోల్టేజ్ యాక్షన్‌తో 'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. బాలయ్య కెరీర్‌లో 109వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. హై ఎండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు USAలోని డల్లాస్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్‌గా నిర్వహించారు.

Details

డల్లాస్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్  

వేలాదిమంది అభిమానులు ఈ ఈవెంట్‌కు తరలిరావడంతో ఆడిటోరియం జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తీసుకున్న టేకింగ్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి. ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్‌లతో కట్ చేసి, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా చూపించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో తాండవం ఆడినట్లు కనిపిస్తోంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌ను మరింత ఉన్నత స్థాయికి చేర్చింది.