Actor Darshan: అభిమాని హత్య కేసులో దర్శన్‌కు మధ్యంతర బెయిల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 30, 2024
11:05 am
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ నటుడు దర్శన్‌కు అభిమాని హత్య కేసులో అరెస్టు అయిన తర్వాత కాస్త ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఆరు వారాల పాటు వైద్య చికిత్స కోసం విడుదలవ్వనున్నారు. ఈ మేరకు కోర్టు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.