దాస్ కా ధమ్కీ రివ్యూ : విశ్వక్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..?
ఈ వార్తాకథనం ఏంటి
ఫలక్‌నామా దాస్ తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. తర్వాత నటించిన చిత్రాలను అశించిన స్థాయిలో ఆడలేదు. దాస్ కా ధమ్కీ కమర్షినల్ ఎంటైర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ ఈ సినిమాతో ధమ్కీ ఇచ్చాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం..
కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఓ అనాథ. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. కనీసం ఒకరోజైన డబ్బున్న వాడిగా ఉండాలని ఆశపడుతుంటాడు. ఆలాంటి అవకాశం వచ్చిన సమయంలో కీర్తి(నివేతా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. ఓ రోజు నిజం తెలియడంతో దాస్‌తో సహా అతని స్నేహితులకు ఉద్యోగం పోతోంది.
ఇలాంటి సమయంలో సిద్దార్థ్ మల్హోత్రా (రావురమేష్) దాస్‌ను కాపాడుతాడు.
విశ్వక్‌సేన్
యాక్టర్ గా ఓ మెట్టు పైకెక్కిన విశ్వక్‌సేన్
సంజయ్ రుద్ర ఓ వారం నటించి సమస్య నుంచి బయటపడేయాలని సిద్దార్థ్ మల్హోత్రా కోరుతాడు. ఓ చిన్న తప్పు కారణంగా సంజయ్ రుద్ర చనిపోతాడని దాస్ వల్లే చనిపోతాడు. దాంతో అందరికీ నిజం చెప్పేయాలనుకుంటాడు. అయితే కథలో దాస్‌కి, సంజయ్ రుద్రకి ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గత చిత్రాల కంటే విశ్వక్ సేన్ యాక్టర్ గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. రెండు పాత్రలలో చక్కగా నటించాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పడిపోయానే పిల్లా, మావా బ్రో ఆకట్టుకున్నాయి. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ట్విస్టులు కావాలనుకొనే ప్రేక్షకులు ఓసారి సినిమాను చూడొచ్చు.
రేటింగ్ : 2.75/ 5