దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, డైరెక్షన్ ఆపేయమని సలహా ఇచ్చాడు.
ఎందుకో కారణం కూడా చెప్పాడు. విశ్వక్ సేన్ చాలా మంచి నటుడనీ, ఈ నగరానికి ఏమైంది చిత్రంలో సీరియస్ గా ఉంటూనే ప్రేక్షకుల చేత నవ్వించాడనీ, ఆ తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలో పూర్తి విభిన్నంగా కనిపించాడనీ అన్నారు.
ఇలా సినిమా సినిమాకూ కొత్త కొత్త పాత్రలు చేసుకుంటూ వెళ్తున్న విశ్వక్ సేన్, మరిన్ని వైవిధ్యభరితమైన సినిమాలు చేయాలనీ, అందుకోసం దర్శకులకు అవకాశం ఇవ్వాలనీ అన్నారు ఎన్టీఆర్.
దాస్ కా ధమ్కీ
కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్టీఆర్ సూచన
ప్రస్తుతం తెలుగు సినిమా టాప్ లో ఉందనీ చెప్పిన ఎన్టీఆర్, ఇకపై ఎప్పటికీ టాప్ లో ఉండేలా చేయాలంటే వేరు వేరు దర్శకులతో పనిచేయాలనీ, దాస్ కా ధమ్కీ బ్లాక్ బస్టర్ అవ్వగానే డైరెక్షన్ ఆపేయాలనీ, అందుకోసమైనా దాస్ కా ధమ్కీ బ్లాక్ బస్టర్ కావాలనీ అన్నాడు.
మరి ఎన్టీఆర్ సలహాను విశ్వక్ సేన్ పాటిస్తాడా లేదా అనేది చూడాలి. అదలా ఉంచితే, నివేతా పేతురాజ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో, ద్విపాత్రాభినయం చేస్తున్నాడు విశ్వక్ సేన్.
ట్రైలర్ చూస్తే పూర్తి కమర్షియల్ అంశాలతో నిండిన సినిమాగా ఉంది. దాస్ కా ధమ్కీ చిత్రం మార్చ్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.