IRUMUDI : 'ఇరుముడి' గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రవితేజను ఇప్పటివరకు చూడని ఓ కొత్త, పవర్‌ఫుల్ అవతార్‌లో దర్శకుడు శివ నిర్వాణ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన రవితేజ 'అయ్యప్ప మాల' లుక్ సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను పెంచేసింది. ఆ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు చిత్రంపై ఆసక్తిని మరింత పెంచింది. ఈనేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
వివరాలు
జూన్ 3న రిలీజ్
సినిమా స్థాయిని, కథలోని ఇంటెన్సిటీని ప్రతిబింబించేలా ఈ గ్లింప్స్‌ను ఎక్స్‌ట్రార్డినరీగా రూపొందించినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో రవితేజ లుక్ సెన్సేషనల్‌గా ఉండబోతుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. చిత్రబృందం ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
గత కొంతకాలంగా సరైన మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ఇటీవల 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రంతో తన రూట్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు భక్తి, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న 'ఇరుముడి' చిత్రంతో మాస్ మహారాజా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు మరింత పెరుగుతుండటంతో గ్లింప్స్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.