Loading...
Akkineni Nagarjuna : 'కింగ్ 100' గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 29న నాగ్ మాస్ ట్రీట్
'కింగ్ 100' గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 29న నాగ్ మాస్ ట్రీట్

Akkineni Nagarjuna : 'కింగ్ 100' గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 29న నాగ్ మాస్ ట్రీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'కింగ్ 100'పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సి.వి. రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్‌ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు.

వివరాలు

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు

అక్కినేని ఫ్యామిలీపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ.. కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న 'కింగ్ 100' ఎక్సైటింగ్ గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా.. "అక్కినేని ఫ్యామిలీపై మీరు చూపిస్తున్న తిరుగులేని ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కింగ్ నాగార్జున బర్త్‌డే కానుకగా ఆగస్టు 29న రాబోతున్న 'కింగ్ 100' ఎక్సైటింగ్ గ్లింప్స్ కోసం అధికారిక అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాండిల్‌ను ఫాలో అవ్వండి. మనమందరం కలిసి ఈ కింగ్ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం" అని చిత్రబృందం పేర్కొంది.

ప్రస్తుతం 'కింగ్ 100' షూటింగ్ దశలో ఉంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

వివరాలు

ఫుల్ జోష్ లో అభిమానులు

డీఎస్పీ కంపోజ్ చేసిన మాస్ అండ్ ఎనర్జిటిక్ బీజీఎమ్‌తో గ్లింప్స్‌ రాబోతుండటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేయడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లింప్స్‌ విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభిమానులు అధికారిక అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వాలని చిత్రబృందం సూచించింది.

ADVERTISEMENT