Page Loader
WAR 2 : వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!
వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

WAR 2 : వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈసినిమా ఈఏడాది ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సితార నాగవంశీ భారీ ధరకు సొంతం చేసుకుని విడుదల చేయనున్నాడు. ఇదివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ కూడా బయటికి రాకుండా మేకర్స్ భారీ గోప్యత పాటిస్తున్నారు.డైరెక్ట్‌గా థియేటర్లలోనే విజువల్ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని మూవీ టీమ్‌ ప్లాన్ చేస్తోందట.

Details

జూలై 25న ట్రైలర్ విడుదల

కానీ అదే సమయంలో వార్ 2‌కు పోటీగా విడుదల కానున్న 'కూలీ' సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ముందుకెళ్లుతోంది. దాంతో వార్ 2 టీంపై సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి పెరిగింది. ఫ్యాన్స్ తమ డిమాండ్స్‌తో యష్ రాజ్ ఫిల్మ్స్‌ను ట్యాగ్ చేస్తూ ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. దాంతో వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ చేశారు.అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ జూలై 25న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రత్యేక ప్రీమియర్స్ వేసేలా సితార నాగవంశీ ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు.