Page Loader
RC16: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్.. 
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్..

RC16: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాస్ గా పేరుగాంచిన రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ న్యూ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సానాతో రాంచరణ్ తదుపరి ప్రాజెక్ట్ (RC 16) గురించి ఇప్పుడు ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC 16కి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం రేపు హైదరాబాద్‌లో జరగనుందని తాజా అప్‌డేట్ వెల్లడించింది. ఇంకా పేరు పెట్టని ఈ పాన్-ఇండియన్ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర బృందం, ప్రముఖ అతిథులు హాజరవుతారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Details

రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం

ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. వ్రిద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది.