NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే
    తదుపరి వార్తా కథనం
    పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే
    థియేటర్లలోకి వస్తున్న షారుక్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే

    పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 10, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ సినిమా చరిత్రలో మరపురాని చిత్రంగా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీ, దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు మళ్ళీ సిద్ధం అవుతోంది.

    షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన డీడీఎల్జే, అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా, ఫిబ్రవరి 10వ తేదీ నుండి వారం రోజుల పాటు థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటించింది. ముంబై, పూనా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహమ్మదాబాద్.. ఇలా మొత్తం 37నగరాల్లో థియేటర్లల ప్రదర్శితం కానుంది డీడీఎల్జే.

    యష్ రాజ్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ మల్హోత్రా మాట్లాడుతూ, డీడీఎల్జే మూవీని మళ్ళీ మళ్ళీ విడుదల చేయాలని అభిమానులు పదే పదే కోరుకున్నారని అన్నారు.

    షారుక్ ఖాన్

    అటు పఠాన్, ఇటు డీడీఎల్జే

    1995లో రిలీజైన డిడీఎల్జే, ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో కొన్నేళ్ళ పాటు నడిచింది.

    ప్రస్తుతం, ఈరోజు నుండి మరో వారం రోజుల పాటు అన్ని ప్రముఖ నగరాల్లోని థియేటర్లలో డీడీఎల్జే కనిపించనుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, అటు పఠాన్ మూవీ, దుమ్ముదులిపే కలెక్షన్లతో దూసుకుపోతుంటే ఇటు డీడీఎల్జే, థియేటర్లలోకి మళ్ళీ రావడం.

    దీంతో షారుక్ అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు. చాలారోజులుగా షారుక్ ఖాన్ మూవీ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకు అటు పఠాన్ ఆకలి తీరిస్తే, ఇటు డీడీఎల్జే.. మనసుకు తృప్తినిచ్చిందని చెప్పుకుంటున్నారు.

    యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందిన డీడీఎల్జే మూవీలో షారుక్ ఖాన్ సరసన కాజోల్ నటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025