LOADING...
Chiranjeevi : చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా డీప్‌ఫేక్‌ ఫోటోలు.. కేసు నమోదు
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా డీప్‌ఫేక్‌ ఫోటోలు.. కేసు నమోదు

Chiranjeevi : చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా డీప్‌ఫేక్‌ ఫోటోలు.. కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఈ ఆధునిక సాంకేతికతను ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటుల ఫేక్‌ వీడియోలు సృష్టించి, వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం కొత్త ట్రెండ్‌లా మారింది. ఇప్పటికే కాజోల్‌, కత్రినా కైఫ్‌, రష్మిక మంధాన వంటి తారలు ఈ డీప్‌ఫేక్‌ మాయాజాలానికి బలైపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్‌ చిరంజీవి పేరు కూడా చేరింది.

Details

పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి

చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి, వాటిని అసభ్యకర వీడియోలుగా మార్చి కొందరు దుండగులు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్ములలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలు తక్కువ సమయంలోనే వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఆయన సూచనల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన పేరు, ప్రతిష్ఠ దెబ్బతినేలా ఇలాంటి వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.