Loading...
Deepika Padukone: మరోసారి తల్లైన దీపికా.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్
మరోసారి తల్లైన దీపికా.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్

Deepika Padukone: మరోసారి తల్లైన దీపికా.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రణ్‌వీర్‌ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపికకు ఇప్పటికే దువా అనే కూతురు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా ఆడబిడ్డే జన్మించడంతో ఈ దంపతుల ఆనందం రెట్టింపైంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన స్టార్‌ జంటకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

వివరాలు

ఆనందంలో మునిగిపోయిన దంపతులు

వీరి వివాహ వేడుకలు ఇటలీలో గ్రాండ్‌గా జరిగాయి. పెళ్లైన ఆరేళ్లకు.. 2024లో ఈ దంపతులకు తొలిసారి కూతురు జన్మించింది.

ఆమెకు దువా అనే పేరు పెట్టారు. ఇప్పుడు మరోసారి వీరికి ఆడబిడ్డ జన్మించడంతో రణ్‌వీర్‌, దీపికా దంపతులు ఆనందంలో మునిగిపోయారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రణ్‌వీర్‌ సింగ్‌ 'దురంధర్‌' చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ విజయాలను అందుకున్నారు.

ADVERTISEMENT