LOADING...
Deepika Padukone: కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనేని తొలగించడంపై వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన!
కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనేని తొలగించడంపై అధికారిక ప్రకటన!

Deepika Padukone: కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనేని తొలగించడంపై వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి 2898 AD'లో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయానంతరం అభిమానులు సహజంగానే దీని సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకొనేను సీక్వెల్ నుండి తొలగించారు. దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాన్ని కూడా నిర్మాణ సంస్థ వెల్లడించింది. కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటించారు. విస్తృతంగా ఆలోచించిన తరువాత, పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి సినిమా నిర్మాణం చాలా కాలం పాటు సాగినప్పటికీ, మేము ఇకపై కలిసి పనిచేయలేము." అని పేర్కొన్నారు.

వివరాలు 

'కమిట్మెంట్' అనే పదం వాడుకతో మొదలైన చర్చలు. 

ఆ ప్రకటనలో ప్రత్యేకంగా "కమిట్మెంట్" అనే పదాన్ని వినియోగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. "కల్కి 2898 AD వంటి గొప్ప చిత్రం అత్యంత నిబద్ధతతో పాటు అనేక విషయాలకు అర్హమైనది. భవిష్యత్తులో దీపికా చేసే సినిమాలకు మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము." అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, దీపికాను తప్పించడానికి అసలు కారణం ఆమె వర్గం చేసిన కొన్ని అసాధారణ డిమాండ్స్ అని టాక్. భారీ రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, స్టార్ హీరోల స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వాలని పలు కోరుకులు పెట్టిందని సమాచారం. ఇంతకు ముందు సందీప్ రెడ్డి వంగా తన స్పిరిట్ ప్రాజెక్ట్ నుండి దీపికాను తప్పించడానికి కూడా ఇలాంటి కారణాలే అని చెప్పబడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన